చేపలు పట్టేశారని పోలీసులకు ఫిర్యాదు
గంట్యాడ: చేపలు దొంగతనంగా పట్టేశారని పోలీసులకు మత్య్సకారులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొర్లాం గ్రామ చప్పవాని చెరువులో బొండపల్లి మండలం గొల్లుపాలేంకు చెందిన ఏడుగురు వ్యక్తులు బుధవారం చేపలు పడుతుండగా కొర్లాం గ్రామానికి చెందిన మత్స్యకారులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గ్రామానికి చెందిన మత్య్సకారులు సింగిడి కృష్ణ, సింగిడి అప్పలరాము, సింగిడి శ్రీను, సర్పంచ్ చప్ప అబ్బయ్య, గ్రామ పెద్ద చప్ప చిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో రూ.7 లక్షల వరకు మత్య్స సంపద ఉండేదని మత్య్సకారులు తెలిపారు. ప్రస్తుతం చెరువులో వల వేస్తే చేపలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment