విజయనగరం గంటస్తంభం: తమ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చేనెల 6 తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు ఎల్.శాంతమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం, సెలవులు, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, పనిభారం తగ్గించాలని, తదితర డిమాండ్ల పరిష్కారానికి ఆందోళన తలపెట్టామన్నారు. ఏళ్ల తరబడి అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా తమ బతుకులు మారడంలేదన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని ప్రకటించారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.సుధారాణితో కలిసి డీఎంహెచ్‌ఓ జీవనరాణికి వినతి ప్రతం అందజేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment