బొబ్బిలిలో హమాలీల ఆందోళన
బొబ్బిలి: ‘గత 40 సంవత్సరాలుగా బొబ్బిలి రైల్వే స్టేషన్‌లోని వ్యాగన్‌పాయింట్ వద్ద హమాలీలుగా పనిచేస్తున్నాం. ఏటా హమాలీల అగ్రిమెంట్ ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా అగ్రిమెంట్ డిసెంబర్ వరకూ ఉంది. అగ్రిమెంట్‌ను కాదని ఇక్కడ హమాలీలకు చెల్లిస్తున్న కూలిరేట్ల కంటే తక్కువ కూలికి వచ్చేవారిని నియమించుకునేందుకు ప్రయత్నించడం దుర్మార్గం’ అంటూ హమాలీలు ఆందోళన చేశారు. పట్టణ కళాశీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బోగాది అప్పలస్వామి, దంతులూరి వర్మ సమక్షంలో కాంట్రాక్టర్లను నిలదీశారు.
ఇదీ సమస్య...
ఇతర రాష్ట్రాలకు బియ్యం తరలించేందుకు బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో వ్యాగన్ పాయింట్ నాలుగు దశాబ్దాలుగా నడుస్తోంది. ఇక్కడ పలు గ్రామాలకు చెందిన హమాలీలు పనిచేస్తున్నారు. ఇటీవల విశాఖ–రాయపూర్‌ల మధ్య నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ నిర్మాణంతో పాటు రైల్వేస్టేషన్‌లోని పలు భవనాల పనుల కారణంగా రైల్వే వ్యాగన్ పాయింట్‌ను కోమటిపల్లి స్టేషన్‌కు తరలించారు. అక్కడకు వెళ్లిన హమాలీలను కొత్తగా అక్కడ నియమితులైన కార్మికులు అడ్డుకున్నారు. ఏళ్లతరబడి ఇదే పనిగా బతుకుతున్నామని, పనికి రావద్దంటే ఎలా అన్ని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో శుక్ర వారం ధర్నాకు దిగారు. బొబ్బిలి పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో ఉన్న వ్యాగన్‌పాయింట్ నుంచి కోమటిపల్లిలో లోడింగ్‌కోసం వెళ్తున్న సివిల్ సప్లయి లారీలను గ్రోత్ సెంటర్ వద్ద అడ్డుకున్నారు. లారీలన్నింటినీ గ్రోత్‌సెంటర్‌లోని అంతర్గత రోడ్లలోకి మళ్లించి అడ్డంగా నిలబడ్డారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతామంటూ నినదించారు. విషయం తెలుసుకున్న బొబ్బిలి సీఐ కె.సతీష్‌కుమార్, ఎస్‌ఐలు ఆర్.రమేష్, పి.జ్ఞానప్రసాద్, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ సాంకేతిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని హమాలీలకు నచ్చజెప్పే ప్రయత్నంచేసినా వినలేదు. సంఘ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కాంట్రాక్టర్‌తో చర్చలు జరిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబినాయన దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వచ్చే రైల్వే వ్యాగన్ లోడింగ్ పనిలో గతంలో పనిచేసిన హమాలీలే పనిచేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడం, కాంట్రాక్టర్‌తో ఒప్పందపత్రం రాయించడంతో ఆందోళన విరమించి లారీలను విడిచిపెట్టారు. ఆందోళనలో పీడీఎస్‌ఓ నాయకులు సోమేశ్వరరావు, పిరిడి అప్పారావు, యరబాల అప్పారావు, పైల రామకృష్ణ, పౌరసరఫరాల సంస్థ టెక్నీషియన్ హరిశంకర్, కాంట్రాక్టర్లు అప్పారావు, బుల్లిరాజు, లారీ ఓనర్ల సంఘం బొబ్బి లి అధ్యక్షుడు నంబియార్‌వేణుగోపాలరావు, కాకల వెంకటరావు, పిరిడి ఈశ్వరరావు పాల్గొన్నారు.
ఏళ్లతరబడి పనిచేస్తున్నవారిని పక్కన
పెట్టడంపై మండిపాటు
సివిల్ సప్లయి బియ్యం లోడ్‌లను అడ్డుకున్న కూలీలు
బొబ్బిలి రైల్వే స్టేషన్‌వేగన్ పాయింట్ వద్ద ధర్నా
Comments
Please login to add a commentAdd a comment