రామతీర్థం హుండీల ఆదాయం రూ.49.96 లక్షలు
నెల్లిమర్ల రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి హుండీలలో భక్తులు వేసిన కానుకలను దేవస్థానం అధికారులు గురువారం లెక్కించారు. కల్యాణ మండపంలో చేపట్టిన హుండీల లెక్కింపులో రూ.49,96,162 నగదు లభించినట్టు ఈఓ వై.శ్రీనివాసరావు తెలిపారు. 11.800 మిల్లీ గ్రాముల బంగారం, 5 కేజీల 960 గ్రాముల వెండి లభ్యమైందన్నారు. హుండీల లెక్కింపున దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష పర్యవేక్షించారు. ఆదాయం లెక్కింపులో పలువురు శ్రీవారి భక్తులు, తనిఖీదారు శ్యామ్‌ప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
నిఘా నీడలో
ఇంటర్మీడియట్ పరీక్షలు ●
● నేటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహణ
● జిల్లాలో 66 కేంద్రాల ఏర్పాటు
● పరీక్షలు రాయనున్న విద్యార్థులు 41,270 మంది
● వాట్సాప్‌లో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు వేళయింది. గతనెల 11న ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు 20వ తేదీతో ముగిశాయి. శనివారం నుంచి 20వ తేదీ వరకు నిఘానీడలో థియరీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో సాధారణ, వృత్తి విద్యాకోర్సులు కలిపి మొత్తం 41,270 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 20,902 మంది, ద్వితీయ సంవత్సరం 20,368 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికోసం జిల్లాలో మొత్తం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్షల ఏర్పాట్లను జిల్లా కన్వీనర్ మజ్జి ఆదినారాయణ, జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులు పరిశీలించారు. పరీక్షలకు 900 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. ముగ్గురు ఫ్‌లైయింగ్ స్క్వాడ్స్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్స్, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు ప్రతిరోజూ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తారు. పరీక్ష కేంద్రానికి 8.30 గంటలకే చేరుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల హాల్‌టికెట్లను 95523 00009 అనే వాట్స్‌ప్ నంబర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే హాల్‌టికెట్ తీసుకుని నేరుగా పరీక్ష కేంద్రాలకు వెళ్లొచ్చు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లుకు తావివ్వొద్దని పరీక్షల జిల్లా కన్వీనర్ మజ్జి ఆదినారాయణ చీఫ్ సూరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సూచించారు. పరీక్షల పరిశీలన సిబ్బంది సెల్‌ఫోన్లు వినియోగించరాదన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా జిల్లా కేంద్రంలోని ఆర్‌ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఫోన్: 08922–237988కు తెలియజేయాలన్నారు.
నేటి నుంచి కొత్త మెనూ
విజయనగరం అర్బన్: మధ్యాహ్న భోజన పథకానికి ఇంతవరకు వండుతున్న వంటకాలను మార్చుతూ కొత్త మెనూను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన మెనూ శనివారం నుంచి అమల్లోకి వస్తున్నట్లు డీఈఓ యు.మాణిక్యంనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రామతీర్థం హుండీల ఆదాయం రూ.49.96 లక్షలు
రామతీర్థం హుండీల ఆదాయం రూ.49.96 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment