
వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు
విజయనగరం ఫోర్ట్: వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయింత్రం సీహెచ్‌సీ, పీహెచ్‌సీ వైద్యాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, అతిసార వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందుస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధులు విజృంభించకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు అవగాహన కల్పించాలన్నారు. నివేదికలు యాప్‌లో అప్లోడ్ చేసేటప్పడు ఒకటి, రెండుసార్లు సరిచూసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఫీడ్ బ్యాక్ సర్వేలో జిల్లా ర్యాంకు మెరుగుపడాలని, దీని కోసం వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లిప్తతను విడనాడి తమ సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి.వి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు
మార్చి 8వ తేదీన నిర్వహించే మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రాజీవ్ స్టేడియంలో నిర్వహించే మహిళా దినోత్సవానికి సుమారు 4 వేల మంది మహిళలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు వెయ్యి మందికి ఎన్‌ఏటీఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. డీఆర్‌డీఏ నుంచి రూ.121 కోట్లు, మెప్మా నుంచి రూ.20కోట్లు విలువైన బ్యాంకు లింకేజీని అందజేయాలన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న నలుగురు మహిళలను సన్మానించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎ.కళ్యాణచక్రవర్తి, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ జి.ప్రసన్న, డీఎంహెచ్‌ఓ, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment