● గుర్రపు డెక్క.. సాగునీటికి అడ్డుకట్ట
చిత్రంలో గుర్రపుడెక్కతో కనిపిస్తున్నది మడ్డువలస ప్రాజెక్టు ప్రధాన కాలువ. వంగర మండలం నుంచి దాదాపు 55 కిలోమీటర్ల మేర కాలువ విస్తరించి ఉంది. 24,875 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందాలంటే ఈ కాలువే ఆధారం. కాలువను అభివృద్ధి చేయకపోవడంతో ఏటా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. సంతకవిటి మండలంలోని శివారు భూములకు సాగునీరు అందడం లేదు. చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. బొద్దూరు–బిల్లాని గ్రామాల మధ్య కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయి సాగునీటికి అడ్డుకట్టగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు స్పందించి ప్రస్తుత వేసవి కాలంలో కాలువను అభివృద్ధిచేసి సాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. – సంతకవిటి
Comments
Please login to add a commentAdd a comment