అపరాధ రుసుం రూ.6,20,000
ఒకేరోజు
62 కేసులు
విజయనగరం జిల్లా పోలీసులు సోమవారం వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. రోడ్డు నిబంధనలు పాటించని, వాహన పత్రాలులేని 62 మందిపై కేసులు నమోదు చేశారు. పలువురు వాహనచోదకుల నుంచి ఒకే రోజు రూ.6,20,000లు అపరాధ రుసుం వసూలు చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. పోలీస్ తనిఖీలు కొనసాగుతాయన్నారు. మైనర్లకు వాహనాలిచ్చేవారిపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. బైక్‌లపై వెళ్లేవారు హెల్పెట్ ధారణ తప్పనిసరన్నారు. – విజయనగరం క్రైమ్
Comments
Please login to add a commentAdd a comment