ఎన్నికల సమస్యలపై చర్చకు ఈసీ ఆహ్వానం
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ98 శ్రీ166 176
విజయనగరం అర్బన్: జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్‌ఓ, రాష్ట్ర సీఈఓ స్థాయిలో పరిష్కారం కాని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఉంటే రాజకీయ పార్టీలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలకు లేఖలు రాసినట్లు ఎన్నికల సంఘం డైరెక్టర్ అనిల్ చందక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ముగ్గురి అరెస్టు
సీతంపేట: గతంలో సారా విక్రయిస్తూ పరారైన ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్సై వై.అమ్మన్నాయుడు మంగళవారం తెలిపారు. మండలంలోని ఆనపకాయలగూడ గ్రామానికి చెందిన సిమ్మయ్య సారా విక్రయిస్తుండగా పరారయ్యాడని, ఇప్పుడు పట్టుకున్నామని తెలిపారు. అలాగే ఇటీవల నెల్లిగండి గ్రామానికి చెందిన కె.తేజేశ్వరరావు 30 లీటర్ల సారా విక్రయిస్తూ పరారవడంతో పట్టుకుని ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు.
దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో..
దోనుబాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కోసంగి గ్రామంలో 20 లీటర్ల సారా పట్టుకున్నట్టు ఎస్సై అహ్మద్ తెలిపారు. ఈ కేసులో గౌరునాయుడిని అరెస్టుచేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment