చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి వెటర్నరీ కళాశాల ఆవరణలో నెల రోజులపైబడి తమ సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న నిరవధిక దీక్షకు విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం మద్దతు తెలిపారు. కళాశాలకు వీసీఐ గుర్తింపును తీసుకురావాలని, ఎంబీబీఎస్ విద్యార్థుల మాదిరిగానే స్టైఫండ్‌ను అందించాలన్న న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తు ఏమిటో చెప్పాలని కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీనును ప్రశ్నించారు. నెలల తరబడి తరగతులు బహిష్కరించి నిరవధిక దీక్ష చేస్తున్నా స్పందించకపోవడంపై మండిపడ్డారు. దీనిపై డీన్ స్పందిస్తూ స్టైఫండ్ పెంపుదల అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని, కళాశాల నుంచి రిలీవ్ అవుతున్న విద్యార్థులకు ఇతర కళాశాల గుర్తింపుతో బయటకు పంపిస్తామని, విద్యార్థులకు వీసీఐ గుర్తింపులో అన్యాయం జరగదని బదులిచ్చారు.
డీన్‌ను ప్రశ్నించిన పశువైద్య విద్యార్థుల తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment