
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
గజపతినగరం రూరల్: అప్పుల బాధ/తాళలేక ఆత్మహత్యాయ యత్నం చేసిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గజపతినగరం ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం గ్రామానికి చెందిన కురింబిల్లి శ్రీనివాసరావుకు గజపతినగరం మండలం కాళంరాజుపేట గ్రామానికి చెందిన ఈశ్వరితో 15ఏళ్లక్రితం వివాహం జరిగింది. శ్రీనివాసరావు టైల్స్ వ్యాపారం చేస్తూ తెలిసిన వారందరి వద్ద అప్పులుచేసి ఒత్తిడికి గురయ్యేవాడు. అయితే ఈనెల 2వ తేదీన భార్యను కాళంరాజుపేట గ్రామంలో విడిచిపెట్టి మండలంలోని మధుపాడ గ్రామ సమీప మామిడితోటలో పురుగు మందు తాగేసి చనిపోతున్నట్లు అందరికీ సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.