
చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
విజయనగరం క్రైమ్: స్థానిక గాజులరేగకు చెందిన పత్తిగిల్లి దిలీప్‌కుమార్ సిటీ బస్టాండ్‌లో నిర్వహిస్తున్న గాయత్రి మెటల్ మార్ట్ షాప్‌లో 240 కిలోల రాగి,160 కిలోల ఇత్తడి, మూడు ఇన్వర్టర్ బ్యాటరీలతో పాటు 60 వేల నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితుడు వన్‌టౌన్ స్టేషన్‌లో మార్చి 30వ తేదీన ఫిర్యాదు చేయగా వెంటనే స్టేషన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో పెందుర్తి మండలం చినముషిడివాడ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పేండ్ర నాయుడు, పేండ్ర సుదర్శన్ బాబు, ఏసు, కృష్ట అనే నలుగురు చోరీకి పాల్పడినట్లు తేలింది. పక్కా సమాచారం మేరకు పేండ్ర నాయుడు, పేండ్ర సుదర్శన్ బాబులను అరెస్ట్ చేసి, ముప్ఫై వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.