
ద్విచక్రవాహన చోదకుడిని ఢీకొన్న బస్సు
పాలకొండ రూరల్: మండలంలోని గోపాలపురం వద్ద మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ద్విచక్రదారుడిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా అమదలవలసకు చెందిన ఇప్పిలి సత్యనారాయణ విజయనగరం జిల్లా రేగిడి మండంలంలో గల చక్కెర కార్మగారంలో విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో పాలకొండ నుంచి విశాఖ వెళ్తున్న ఓఎంఎస్ సర్వీసు బస్సు గోపాలపురం వద్ద ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడు గాయాలపాలు కాగా వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై ఎస్సై కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో..
పాలకొండ–వీరఘట్టం ప్రధాన రహదారిలో మంగళవారం సాయంత్రం స్కార్పియో వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో మూడు ద్విచక్రవాహనాలు చెల్లాచెదురు కాగా ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయనగరం జిల్లా రేగిడిఆమదాలవలస మండలం వండానపేటకు చెందిన కొమ్మోజు గణపతిరావు తన ద్విచక్రవాహనంపై వీరఘట్టం వెళ్తుండగా అదే మండలంలోని చిన్నయ్యపేటకు చెందిన సవిరిగాన సింహాచలం స్కార్పియో వాహనం నడుపుతూ వీరఘట్టం వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్షం కురుస్తుండడంతో ద్విచక్రవాహనదారు ఉన్నట్లుండి తన వాహనాన్ని కుడివైపు మళ్లించే యత్నం చేశాడు. దీంతో ఆ బైక్‌ను తప్పించబోయిన స్కారియో వాహన చోదకుడు కూడా పూర్తిగా కుడివైపు తన వాహనం తిప్పడంతో ద్విచక్రవాహదారుడిని వెనక నుంచి బలంగా తాకుతూ అక్కడి వైన్‌షాపు ముందు నిలిపి ఉన్న మరో రెండు బైక్‌లను, ముందున ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారు గణపతిరావు గాయాలపాలయ్యడు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఎస్సై కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు.

ద్విచక్రవాహన చోదకుడిని ఢీకొన్న బస్సు