
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ130 శ్రీ230 శ్రీ240
సంతకవిటి ఎస్సైపై దాడి
● 1.50తులం బంగారు చైన్ చోరీ
● ఆలస్యంగా వెలుగులోకి ఘటన
సంతకవిటి: మండలంలోని జావాం గ్రామంలో ఇటీవల జరిగిన పగడాలమ్మ తల్లి జాతర బందోబస్తులో ఉన్న ఎస్సైపై దాడి చేసి 1.50 తులం చైన్ చోరీ చేసినట్లు ఏఎస్సై ఎం.వాసుదేవరావు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 1:30 గంటలకు డ్యూటీలో మాబ్‌ను కంట్రోల్ చేస్తు న్న సందర్భంలో ఎస్.అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెనుక నుంచి ఎస్సైపై దాడిచేసి చేసి చైన్ లాక్కుని వెళ్లిపోయినట్లు బాధిత ఎస్సై ఆర్.గోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వాసుదేవరావు మంగళవారం తెలిపారు.
రైలు ఢీకొని యువకుడి మృతి
కొమరాడ: మండలంలోని అర్తాం–సోమినాయుడువలస రైల్వే గేటు మధ్యలో రైలు ఢీకొని యువకుడు కొప్పర వెంకటరమణ(26) మృతి చెందినట్లు జీఆర్‌పీ హెచ్‌సీ రత్నకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరమణ అర్తాం సమీపంలోని తన పొలానికి వెళ్తున్న క్రమంలో రైల్వేట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగి మృతిచెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆటో బోల్తా పడి వ్యక్తి..
వేపాడ: మండలంలోని బల్లంకి గ్రామానికి చెందిన మారడబూడి రమణ (52) ఆటో బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వల్లంపూడి ఎస్సై బి.దేవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మారడబూడి రమణతో పాటు మరికొందరు కలిసి గ్రామానికి చెందిన ఆటోలో సోమవారం పూసపాటిరేగ మండలం గోవిందపురంలో బంధువుల ఇంటికి వెళ్లి అదే ఆటోలో తిరిగి వస్తుండగా బల్లంకి గ్రామ సమీపంలో గుమ్మడి బందవద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రమణ తల వెనుక భాగంలో గాయం కాగా అక్కడికక్కడే చనిపోయాడని, మిగిలిన వారంతా గాయాల పాలైనట్లు మృతుడి భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడు రమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
20 నాటుకోళ్ల మృతి
వంగర: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణంలో మార్పు వచ్చి గంటన్నర పాటు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. వంగర, ఎం.సీతారాంపురం, మడ్డువలస, మగ్గూరు, సంగాం, ఓనెఅగ్రహారం తదితర గ్రామాల్లో వర్షం కురవగా . మెట్టమగ్గూరు ఎస్టీ కాలనీలో డ్రైనేజీ పూడుకుపోవడంతో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరి గ్రామానికి చెందిన పక్కి గంగమ్మ, సంగాపు పకీరు, సంగాపు జగన్నాథంలకు చెందిన 20 నాటుకోళ్లు మృతిచెందినట్లు బాధితులు వెల్లడించారు. అలాగే మడ్డువలస డ్రైనేజీలు పూడుకుపోవడంతో వర్షం నీరు ఇళ్ల ముందు చేరగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
టిప్పర్ దగ్ధం
పాచిపెంట: మండలంలోని కేరంగి పంచాయతీ నందేడువలస సమీపంలో మంగళవారం విద్యుత్‌వైర్లు తాకి ఓ టిప్పర్ దగ్ధమైంది. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పూడి నుంచి నందేడువలస నూతన రహదారి నిర్మాణానికి టిప్పర్‌లో మెటల్ రాయి తీసుకువెళ్లి నందేడువలస సమీపంలో ఒంపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు టిప్పర్‌కు విద్యుత్ వైర్లు తాకి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్‌లు దూకేయడంతో ప్రాణపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసే సమయానికి టిప్పర్ పూర్తిగా దగ్ధమైపోయింది.విద్యుత్ వైర్లు రోడ్డు పక్కన తక్కువ ఎత్తులో ఉన్నాయని పలుమార్లు మండల, జిల్లా సర్వసభ్య సమావేశాల్లో అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని జెడ్పీవైస్ చైర్మన్, సర్పంచ్, ఎంపీటీసీ విలేకరులకు తెలిపారు.

చికెన్

చికెన్

చికెన్