
ఇంటర్ తప్పిన విద్యార్థులు 22లోగా పరీక్షఫీజు చెల్లించాల
పార్వతీపురంటౌన్: ఇటీవల మార్చి నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ కోసం ఇంటర్ బోర్డు పేర్కోన్న నిర్ణీత గడువులోగా ఫీజులు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ ఫీజు చెల్లించేందుకు తుది గడువు అనే విషయాన్ని విద్యార్థుల తల్లితండ్రులు గమనించాలని కోరారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరాల్లో గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. సబ్జెక్టు వారీగా ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.600తో పాటు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చెప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.275, ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సులకు హాజరయ్యే వారు రూ. 165 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ బీఐఈ.ఏపీ.జోఓవీ.ఐన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ నెల 22వ తేదీలోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మే.28 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నైతికత, మానవ విలువలు పరీక్ష జూన్ 4న, పర్యావరణ విద్య పరీక్ష జూన్ 6న జరగనున్నట్లు వివరించారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజుల వీణ