
● ప్రైవేటు ఫిట్‌నెస్ కేంద్రం ఎత్తేయాలి
ఆటో కార్మికులకు గుదిబండగా మారిన ప్రైవేటు ఫిట్‌నెస్ కేంద్రాన్ని ఎత్తివేయాలని, మోటారు
కార్మికులకు ఉరితాడుగా మారిన మోటారు
కార్మికుల వ్యతిరేక చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయనగరం పాతబస్టాండ్ వద్ద మేడే పోస్టర్లను యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు నీలాపు అప్పలరాజురెడ్డి, రెడ్డి నారాయణరావు, ఆటోవాలాలు సోమవారం ఆవిష్కరించారు. మేడే రోజున ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగతామన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చెన్నా ధర్మా, బాలి సన్యాసిరావు, గేదెల నారాయణరావు, తర్లాడ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం టౌన్