మీనమేషాలు!
జిల్లాలో నత్తనడకన ఉచిత చేప పిల్లల పంపిణీ
●
చేపల విక్రయంతోనే జీవనం..
చెరువులోని చేపలు పట్టి విక్రయించడమే ప్రధాన వృత్తి. అలాంటిది నేటి వరకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను వదలకపోవడం బాధాకరం. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి అమరచింత పెద్ద చెరువు అలుగు పారడంతో సొసైటీ ద్వారా డబ్బులు వెచ్చించి చేప పిల్లలు కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది.
– వినయ్,
మత్స్యకారుడు, అమరచింత
త్వరగా పంపిణీ చేయాలి..
నిత్యం చేపలు పట్టి అమ్మడంతోనే జీవనం కొనసాగుతుంది. గత ప్రభుత్వం సకాలంలో చేప పిల్లలు పంపిణీ చేసేది. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. అమరచింత పెద్ద చెరువులో గతంలో లక్ష చేప పిల్లల మేర వదిలితే.. ప్రస్తుతం 45 వేలు మాత్రమే మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నారు. వీటిని సైతం సకాలంలో పంపిణీ చేయడం లేదు.
– సురేశ్, మత్స్యకారుడు, అమరచింత
అమరచింత: జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నత్తనడకన కొనసాగుతోంది. ఈ ఏడాది సకాలంలో టెండర్ల ప్రక్రియ పూర్తిగాకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఆలస్యం కాగా.. మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిసారి వర్షాకాలంలో చెరువులు, కుంటలు నిండిన వెంటనే చేప పిల్లల పంపిణీ చేపట్టే అధికారులు.. ఈ ఏడాది మాత్రం నిర్ణీత సమయానికి పూర్తి చేయలేకపోయారు. గతేడాది జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో 2.20 కోట్ల చేప పిల్లలు వదలగా.. ఈసారి కేవలం 70 లక్షలు మాత్రమే సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. సన్నరకం, పెద్దరకం సైజు చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం టెండర్లు పిలిచినా.. కేవలం పెద్ద సైజు చేప పిల్లలను సరఫరా చేయడానికి మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు.
‘జూరాల’పై ఆధారపడి..
నందిమళ్లకు చెందిన సుమారు 300 మత్స్యకార కుటుంబాలు ప్రియదర్శిని జూరాల జలాశయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రతి ఏడాది ఉచిత చేప పిల్లలను జలాశయం వెనుక జలాల్లో వదులుతుండటంతో రోజు చేపలు పట్టి వాటిని విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే జలాశయంలో చేప పిల్లలను వదలాలని వారు కోరుతున్నారు.
గతేడాది 2.20 కోట్లు ఉండగా..
ఈ ఏడాది 70 లక్షలకే పరిమితం
ఆందోళనలో మత్స్యకారులు
ఇప్పటి వరకు పంపిణీ చేసింది
70 శాతమే..
జిల్లాలో 70 శాతం పూర్తి..
జిల్లాలో ఈ ఏడాది 70 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడానికి టెండర్లు ఆహ్వానించాం. ఇప్పటి వరకు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో 70 శాతం పంపిణీ చేశాం. ఆత్మకూర్, అమరచింత మండలాల్లో మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని మక్తల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే పంపిణీ పూర్తి చేస్తాం.
– డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ
మీనమేషాలు!
మీనమేషాలు!
మీనమేషాలు!
మీనమేషాలు!
Comments
Please login to add a commentAdd a comment