
మరో కీలక సైబర్ నిందితుడు అరెస్ట్
వనపర్తి: నకిలీ ధని రుణ యాప్‌తో రూ.2 కోట్లు కాజేసిన సైబర్ కేసులో మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబర్‌క్రైం డీఎస్పీ ఎన్‌బీ రత్నంతో కలిసి వివరాలు వెల్లడించారు. ఇదివరకు జిల్లాలో నమోదైన సైబర్ కేసులో పలువురుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొనసాగుతున్న విచారణలో భాగంగా పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు మూసాపేట మండలం స్ఫూర్తితండాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం దాడిచేసి పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.4 లక్షల నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమీప కనకాపూర్ తండాకు చెందిన మరికొందరితో కలిసి బిహార్‌కు చెందిన పంకజ్‌కుమార్‌యాదవ్, అంకిత్‌యాదవ్ గురూజీ, రాహుల్ పాశ్వాన్, దీపక్‌కుమార్, సునీల్ కుమార్, షంబు, కార్తీక్, వివేక్ కుశవాహ సూచన మేరకు వారిచ్చిన సెల్‌నంబర్లకు ధని లోన్ మంజూరైనట్లు సమాచారమిచ్చి ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇన్స్యూరెన్స్ తదితర చార్జీలు ముందుగానే చెల్లించాలంటూ క్యూఆర్ కోడ్‌ని పంపించి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఇటీవల గోపాల్‌పేట మండలం పొలికెపాడులోని ఓ వ్యక్తికి ఫోన్‌చేసి పలు దఫాలుగా రూ.32,125 ఫోన్‌పే నుంచి పొందినట్లు బయటపడిందని తెలిపారు. పలువురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నన్నారని.. త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ వివరించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ కృష్ణ, సైబర్‌క్రైం ఎస్‌ఐ రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
రూ.4 లక్షలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment