ఏఐ విధానంలో బోధన అందిస్తే విద్యార్థి పాఠ్యాంశాన్ని స్వయంగా తిలకిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రస్తుతం పురాణాల్లో యుద్ధాలు, సిపాయిల తిరుగుబాటు, స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలు, విత్తనాలు మొలకెత్తడం తదితర అంశాలను విద్యార్థులు పుస్తకాలు చదివి తెలుసుకుంటున్నారు. ఏఐ విధానంలోనైతే దృశ్యరూపంలో చూస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో చూసిన పాఠ్యాంశాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకునేందుకు అవకాశం ఉంటుంది.
జిల్లాలో 580 పాఠశాలలు..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలలు 580 ఉండగా.. విద్యుత్ సౌకర్యం 536 పాఠశాలకు, జనరేటర్, ఇన్వర్టర్ సౌకర్యం ఉన్న పాఠశాలలు 83 ఉన్నాయి. 344 పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఉండగా.. 154 పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటీవల వెల్లడించిన నివేదికలో పేర్కొన్నారు. వీటిలో ఏయే పాఠశాలలను ఎంపిక చేస్తారన్న విషయం రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment