బాలసదన్‌ను సందర్శన..
వనపర్తి: జిల్లాలోని బాలసదన్‌ను గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని సందర్శించారు. బాలసదన్‌లోని పిల్లలకు బాల కార్మిక, బాల్య వివాహాలు, మోటార్ వెహికల్ తదితర చట్టాల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పిల్లలకు ప్యానెల్ అడ్వొకేట్, పారాలీగల్ వలంటీర్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారి పేర్లు, ఫోన్‌నంబర్లు ఉన్న చార్ట్‌ను బాలసదన్‌లో ప్రదర్శించారు. కార్యక్రమంలో సఖి లీగల్ కౌన్సిలర్ కృష్ణయ్య, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ కవిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment