‘మన ఇసుక వాహనం’ వినియోగించుకోవాలి
వనపర్తి: జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నాయని.. భవన నిర్మాణదారులు ‘మన ఇసుక వాహనం’ ద్వారానే ఇసుక పొందాలని, దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో కోరారు. కావాల్సిన మేర ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే సరఫరా చేస్తామని.. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్ నంబర్ 08545–233525కు ఫోన్‌చేసి తెలపవచ్చని పేర్కొన్నారు. లేదంటే రూం నంబర్ 115కు నేరుగా వచ్చి తమ సమస్యలను తెలియజేసి సాయం పొందవచ్చని కోరారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. ఇసుక అక్రమ వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో గురువారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిపివేశారని వివరించారు. ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 147 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు.
ఆస్పత్రిని సందర్శించిన డబ్ల్యూహెచ్‌ఓ బృందం
దేవరకద్ర: దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. ఆస్పత్రిలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించారు. ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో మ హిళలకు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఐసీయూ గదిని, అందులో ఉన్న సదుపాయలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాలలో పల్లె దవ ఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తెచ్చినట్లు డీఐఓ పద్మజ వివరించా రు. కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య బృందం సభ్యులు శ్రవణ్, సోనికా, విశాల్, సుబాష్, పవన్‌కుమార్, ఎల్‌హెచ్‌ఓ మహేశ్, రమేశ్, కిషన్, వైద్యాధికారి శరత్‌చంద్ర పాల్గొన్నారు.
సగర శంఖారావాన్ని
విజయవంతం చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్: సగరుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 16న జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సగర శంఖారావం నిర్వహిస్తున్నామని.. సగరులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పుర పరిధిలోని ఊయ్యాలవాడ సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాముడి వారసత్వం, భగీరథుడి వంశం సగరులదని.. ఇప్పుడు సగర కులం అంటే రోజువారీ కూలీలు, తాపీ మేసీ్త్రలుగా మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని, బీసీలకు ప్రభుత్వం కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్లలో సగరుల వాట ఎంత అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ పదవి సగరులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment