
నాణ్యమైన వైద్యసేవలతోనే గుర్తింపు
వీపనగండ్ల: గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించినప్పుడే గుర్తింపు లభిస్తుందని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిషన్ మధుమేహ, అనుమానిత కేసులు, రోగుల ఆన్‌లైన్ నమోదు తదితర అంశాలపై వైద్యసిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లోని సుమారు 40 గ్రామాలకు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. రాబోయే వేసవిలో ప్రజలు వడదెబ్బ బారినపడకుండా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని, విధులను నిర్లక్ష్యం చస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి డా. వంశీకృష్ణ, వైద్యాధికారి డా. రాజశేఖర్, ఆయుష్ వైద్యులు డా. హేమవర్ధన్, డా. శ్వేత, డా. కరుణశ్రీ, డా. భాగ్యశ్రీ, సూపర్‌వైజర్ దయామని, కేశవులు, కళమ్మ, రాములు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు
Comments
Please login to add a commentAdd a comment