
25 మంది విద్యార్థులు గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని 14 కళాశాలల్లో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 25 మంది విద్యార్థులు గైర్హజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రాక్టికల్స్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులు థియరీ పరీక్షలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని స్కాలర్స్, మహాత్మా జ్యోతిరావుపూలే, టిమ్రిస్, నివేదిత జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని వివరించారు. ఉదయం పరీక్షలకు 401 మంది విద్యార్థులకుగాను.. 386 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం పరీక్షలకు 254 విద్యార్థులకుగాను 244 హాజరుకాగా.. 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు నరేంద్రకుమార్, శ్రీనివాసులు నాలుగు పరీక్ష కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కవిత, శ్రీనివాస్ ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment