సీఎం రేవంత్‌రెడ్డి
గత ఏడాదిలో పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థి సంఘాల ఆందోళన చేయగా వీసీ.. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కొట్టించారన్న ఆరోపణలతో దీక్షలు కొనసాగించారు. అప్పటి ప్రతిపక్ష నేతలు పరామర్శించి మద్దతు పలికారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా దీక్ష శిబిరం సందర్శించి విద్యార్థులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అఽఽధికారంలోకి వచ్చాక వీసీ రమేశ్‌పై విచారణ కమిటీని వేయిస్తానని, పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించడం దారుణమని వీసీ, రిజిస్ట్రార్లపై మండిపడ్డారు. తాజాగా పలువురు సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారు. యూనివర్సిటీ పరిస్థితిపై ఆయన ఆరా తీస్తారా.. లేదా అన్నది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment