హన్మకొండ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 26న ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓరుగల్లు వైభవాన్ని, శివతత్వాన్ని చాటేలా ఆధ్యాత్మిక నిలయమైన ఓరుగల్లు గడ్డ మీద ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ప్రతి సంవత్సరం మాదిరిగానే మహా శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఓరుగల్లు ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాకేశ్‌రెడ్డితోపాటు ప్రముఖ గేయ రచయిత వెన్నెల శ్రీనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment