బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, గృహాలకు సంబంధించి ఆస్తి పన్నులు విధిగా సకాలంలో చెల్లించి నగర ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలని కమి షనర్ అశ్విని తానాజీ వాకడే కోరారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యానికి జీడబ్ల్యూఎంసీ విధించిన డీవియేషన్ పెనాల్టీ, జరిమానా, ఆస్తి పన్ను మొత్తం రూ.7,23,289 చెక్కు ఆదివారం కాజీపేట సర్కిల్ కార్యాలయంలో కమిషనర్‌కు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, రెవెన్యూ అధికారి యూసుఫొద్దీన్, సూపరింటెండెంట్ అనిల్, ఆర్‌ఐలు దేవరాజ్, రజని, బిల్‌కలెక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment