
సైనిక్ స్కూల్‌కు స్కోచ్ అవార్డు
ఖానాపురం: మండలంలోని అశోక్‌నగర్‌లో ఉన్న గిగిరిజన సైనిక్ స్కూల్ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతదేశ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు లేదా సంస్థల కృషిని గుర్తించి స్కోచ్ అవార్డును అందిస్తారని పేర్కొన్నారు. అవార్డు కోసం జాతీయస్థాయిలో పలు విద్యాసంస్థలు పోటీలో పాల్గొనగా సైనిక్ స్కూల్ గెలుచుకుందన్నారు. స్కూల్‌కు చెందిన 27 మంది విద్యార్థులు త్రివిధ దళాలు, పోలీస్ అకాడమీలో ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. మరో 20 మంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇండియన్ మేరీ టైం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందారని ఆయన వివరించారు. ఫలితాల కృషితో సైనిక్ స్కూల్‌కు అవార్డు లభించిందని చెప్పారు. గిరిజన గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మి, ఓఎస్డీ నటరాజ్ న్యూఢిల్లీలో అవార్డు అందుకున్నట్లు తెలిపారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి
వరంగల్: కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై వినతులను కార్యాలయంలో అందించాలని ఆమె సూచించారు.
నేడు, రేపు యువజన
క్రీడోత్సవాలు
వరంగల్ స్పోర్ట్స్: నెహ్రూయువ కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 17, 18వ తేదీల్లో సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి యువజన క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌వైకే జిల్లా అధికారి చింతల అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తాలూకా స్థాయిలో నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జిల్లాస్థాయిలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. యువకులకు వాలీబాల్, అథ్లెటిక్స్, షటిల్‌బ్యాడ్మింటన్, యువతులకు కబడ్డీ, షటిల్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల వయస్సు 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 93908 31502 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
తప్పిపోయిన చిన్నారి అప్పగింత
ఎస్‌ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం మేడారానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నర్సంపేటకు చెందిన రాజు తన కుటుంబ సభ్యులతో దర్శనానికి రాగా తన కుమార్తె హఫియా తప్పిపోయింది. ఈ విషయాన్ని రాజు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమైన వాకీటాకీల ద్వారా సమన్వయంతో చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. డీఎస్పీ రవీందర్ సమక్షంలో హఫియాను తల్లిదండ్రులకు అప్పగించారు. తన కుమార్తె సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
21 నుంచి మూడేళ్ల లా మొదటి సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిమ్ ఇక్బాల్ తెలిపారు. ఈనెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు ఐదవ సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 22, 25, మార్చి 1, 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు.

సైనిక్ స్కూల్‌కు స్కోచ్ అవార్డు
Comments
Please login to add a commentAdd a comment