
జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శిగా వినయ్‌కుమార్
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా శ్రీరామోజు వినయ్‌కుమార్ ఎన్నికయ్యారు. తెలంగాణ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి లక్ష్మీ, కోశాధికారి నర్సింగరావు పర్యవేక్షణలో సోమవారం నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో జిల్లా నూతన అధ్యక్షుడిగా గుళ్లపెల్లి వివేక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరామోజు వినయ్‌కుమార్, కోశాధికారిగా శరత్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఈ మేరకు చెస్ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి లక్ష్మీ చేతుల మీదుగా వినయ్‌కుమార్ నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చెస్ అసోసియేషన్ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులకు వినయ్‌కుమార్ ప్రత్యేక కృతజ్ఞతులు తెలిపారు.
క్రీడలతో మానసికోల్లాసం
వర్ధన్నపేట: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని వర్ధన్నపేట ఏసీపీ నరసయ్య అన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఏసీపీ సోమవారం ప్రారంభించారు. తొలి మ్యాచ్ యూత్ సభ్యులతో సరదాగా ఏసీపీ, పోలీస్ అధికారులు ఆడి యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత చెడు మార్గాలకు దూ రంగా ఉంటూ సామాజిక సేవలో ముందుంటూ ఆదర్శంగా ఉండాలన్నారు. అదేవిధంగా క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
స్వయం పరిపాలన
దినోత్సవం
నర్సంపేట రూరల్: నర్సంపేట మండల పరిధిలోని మాధన్నపేట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అర్చన, సుధావాణి, లీలా, అశోక్, వెంకన్న, విశాల, చంద్రమోహన్, పీఈటీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు
కంటి పరీక్షలు
గీసుకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రి, నర్సంపేట జనరల్ ఆస్పత్రి, వరంగల్‌లోని రీజినల్ కంటి ఆస్పత్రిలో కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.సాంబశివరావు తెలిపారు. వరంగల్ జిల్లాలో 36,368మంది విద్యార్థులు ఉండగా అందులో 33,516మందికి కంటి పరీక్షలు(92.36శాతం) నిర్వహించగా 1,074 మంది విద్యార్థులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి సోమవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు చికిత్స అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ మేరకు వరంగల్ రీజినల్ కంటి ఆస్పత్రిలో 43మంది, నర్సంపేట జనరల్ ఆస్పత్రిలో 32మంది, వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్‌లో 20మందికి పరీక్షలు చేయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఐవో ప్రకాశ్, ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శిగా వినయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment