
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
వరంగల్: ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణిలో అందజేస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీ దారుల నుంచి కలెక్టర్ స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 86 దరఖా స్తులు రాగా అందులో రెవెన్యూ 33, వ్యయసాయశాఖ 7,డీఆర్‌డీఓ, జిడబ్ల్యూఎంసీ, ఎంజీఎంకు సంబంధించిన సమస్యలపై 5చొప్పున వినతులు వచ్చి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణిలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏకశిల కాలేజీపై చర్యలు తీసుకోవాలి..
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్న వరంగల్ కొత్తవాడలోని ఏకశిల మహిళా జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారదకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే వరంగల్‌లోని వేణురావు కాలనీలో అనుమతి లేకుండా ఏకశిల యాజమాన్యం బాయ్స్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఏఐఎస్‌బీ, ఏఐఎస్‌ఎఫ్, ఏబీఎస్‌ఎఫ్, స్వేరోస్, డీవైఎఫ్‌ఐ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment