డిజిటల్ విప్లవం
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
‘తరగతి గది’లో
● ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులతో బోధన
● విద్యార్థికి అభ్యాసం–ఉపాధ్యాయుడికి సులభతరం
● జిల్లాలోని 160 సర్కారు స్కూళ్లలో 444 బోర్డులు
● 1,326 మంది టీచర్లకు పూర్తయిన శిక్షణ
విద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సులభతరంగా విద్యాబోధన చేయడానికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులు(ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లో డిజిటల్ విప్లవం వచ్చిందనడంలో అతిశయోక్తిలేదు. ఈ సదుపాయం ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. కొంత కాలం క్రితమే వీటిని పాఠశాలల్లో ఏర్పాటు చేసినప్పటికీ వాటి వినియోగంపై ఉపాధ్యాయులకు స్పష్టత లేకపోవడంతో ఇటీవలే అవగాహన కల్పించారు.
జిల్లాలోని 160 పాఠశాలల్లో 444 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డులను కొంతకాలం క్రితమే ప్రభుత్వం మంజూరు చేయగా ఇన్‌స్టాల్ చేశారు. అయితే వీటిపై ఉపాధ్యాయులకు సరైన అవగాహన లేక పోవడం.. ఆపరేటింగ్ తెలియక.. సమగ్రంగా వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సబ్జెక్టు టీచర్లందరికీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లపై శిక్షణ ఏర్పాటు చేసింది. ఒక రోజు శిక్షణ శనివారంతో ముగిసింది. శిక్షణలో 123 మంది హెచ్‌ఎంలతోపాటు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, ఫిజికల్‌సైన్స్, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, లాంగ్వేజ్ పండిట్లు, ఉర్దూ ఉపాధ్యాయులు 1,203 మంది మొత్తం 1,326 మంది ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో 14 మంది రిసోర్స్ పర్సన్లకు రెండు రోజులు శిక్షణ ఇవ్వగా.. వారి ద్వారా జిల్లాలో సబ్జెక్టుల వారీగా మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులను గుర్తించి 196 మందికి జిల్లా స్థాయి శిక్షణ ఇచ్చారు. వీరు కాంప్లెక్స్ స్థాయిలో సబ్జెక్టు టీచర్లకు మూడు రోజులపాటు శిక్షణ అందజేశారు.
విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం – తెలంగాణ సమగ్ర శిక్ష సహకారంతో ఐఎఫ్‌పీ బోర్డులను తరగతి గదుల్లో ఏర్పాటు చేసి వాటి లోపల ఎల్‌ఎంఎస్, డిజిటల్ పాఠాలను అప్‌లోడ్ చేశారు. సరికొత్త సమాచార సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకొని తరగతి గదిలో హై డెఫినేషన్ విజువల్స్–టచ్ సపోర్టెడ్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో బోధన సులువవుతుంది. ఈ బోర్డులను టీవీగా డిజిటల్ బోధనకే కాకుండా టచ్–స్టైలిష్ సహకారంతో బ్లాక్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ దృశ్య రూపంలో చూపెట్టడం వల్ల ప్రత్యక్ష అనుభూతి పొందుతూ నేర్చుకోగలుగుతారు.
ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి
జిల్లాలో ఐఎఫ్‌పీ బోర్డులు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి. ఈ మేరకు హెచ్‌ఎంలను ఆదేశించాం. ఇంటర్నెట్‌కు అయ్యే వ్యయం పాఠశాలలకు మంజూరయ్యే మెయింటినెన్స్ గ్రాంట్ నుంచి వాడుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాఠశాలలకు విద్యుత్ బిల్లులు మాఫీ చేసినందున ఆ నిధులను ఇంటర్నెట్‌కు వాడుకోవాలి.
– వాసంతి, డీఈఓ
సపోర్టింగ్ మానిటరింగ్ ఉంటుంది
ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేయడానికి ఐఎఫ్‌పీ బోర్డులను వినియోగించుకోవచ్చు. డిజిటల్ బోధనకు సపోర్టింగ్ మానిటరింగ్ కూడా ఉంటుంది. జిల్లాలోని రిసోర్స్ పర్సన్ల ద్వారా ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు వాటి వినియోగంపై అవసరమైన సలహాలు సూచనలు ఇస్తాం. సమర్థవంతంగా హెచ్‌ఎంలు, టీచర్లు వినియోగించుకోవాలి.
– ఎ.శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్
●
న్యూస్‌రీల్
ఉపాధ్యాయులకు శిక్షణ
ఐఎఫ్‌పీ అవసరం ఏమిటంటే..
ఆకట్టుకునేలా బోధన
ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని సులభంగా అర్థం చేయించే అవకాశం ఉంది.
ప్రొజెక్టర్, కేయాన్లకు ప్రత్యామ్నాయంగా సులువైన ఆపరేషన్
ఇంటర్నెట్, యూట్యూబ్, విద్యా చానల్స్, పెన్ డ్రైవ్, వాట్సాప్‌లతో కనెక్టివిటీ చేయడం ద్వారా బోధన సులువవుతుంది.
విద్యార్థులకు దృశ్య మాలికతతో కూడిన అభ్యాసము చేయించవచ్చు.
ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా చూపించడం,
అవసరమైనప్పుడు డిజిటల్ పాఠాన్ని ఆపి వైట్ బోర్డు సహాయంతో బోధించే అవకాశం ఉంది.
బోధన సమయాన్ని ఆదాచేయడం, సరళంగా బోధించడం తదితర ఉపయోగాలున్నాయి.
డిజిటల్ విప్లవం
డిజిటల్ విప్లవం
Comments
Please login to add a commentAdd a comment