
విద్యార్థి అదృశ్యం.. ప్రత్యక్షం
ఖానాపురం: సైనిక్‌స్కూల్‌కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమై ప్రత్యక్షమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తండ్రితోపాటు ఎస్సై రఘుపతి వెల్లడించిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడుగోని గ్రామానికి చెందిన సాయివర్ధన్ సైనిక్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 16న స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో తోటి విద్యార్థులతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రోజంతా డార్మెంటరీలో తోటి విద్యార్థులతో మా ట్లాడకుండా.. సోమవారం ఉదయం కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రఘుపతి స్కూల్‌లో విచారణ చేపట్టారు. తండ్రి నారాయణ ద్వారా ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్కూల్ నుంచి అదృశ్యమైన సాయివర్థన్ ఇల్లందులో ప్రత్యక్షమై బంధువులకు ఫోన్ చేయడంతో వారు ఇంటికి తీసుకెళ్లారు. విద్యార్థి ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నా రు. విషయం తెలసుకున్న కలెక్టర్ సత్యశారద.. ఇన్‌చార్జ్ తహసీల్దార్ రాజారేణుక, ఎంపీడీఓ సునీల్‌కుమార్‌లను స్కూల్ వద్దకు పంపించారు. అధికారులు ఫిర్యాదుల పెట్టెను పరిశీ లించి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. కాగా సైనిక్‌స్కూల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని విద్యార్థి సంఘాల బాధ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విచారణ చేపట్టిన అధికారులు

విద్యార్థి అదృశ్యం.. ప్రత్యక్షం
Comments
Please login to add a commentAdd a comment