వరంగల్
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ఆర్టీసీ ఉద్యోగులకు ‘పవర్’
ఆర్టీసీ ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా సన్నద్ధులను చేసేందుకు ‘పవర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం చేపట్టింది.
– 8లోu
పర్వతగిరిలోనే
10 మీటర్ల లోతున నీరు
● వర్ధన్నపేట, రాయపర్తిలో
ఇబ్బందికర పరిస్థితే..
● వరిసాగు విస్తీర్ణం ఎక్కువగా
ఉండడమే కారణం
● జిల్లాలో 13 మండలాలు..
1,16,500 ఎకరాల్లో పంటల సాగు
● అవసరం మేరకు నీటిని
వినియోగించాలని అధికారుల సూచన
మండలాల వారీగా భూగర్భ జలమట్టం వివరాలు మీటర్లలో..
మండలం నవంబర్ డిసెంబర్ జనవరి
చెన్నారావుపేట 0.80 0.85 0.97
దుగ్గొండి 1.72 1.89 2.51
గీసుకొండ 3.09 3.50 4.50
ఖానాపురం 2.3 2.86 3.08
నల్లబెల్లి 2.53 4.05 5.05
నర్సంపేట 2.72 3.37 5.40
నెక్కొండ 2.67 3.40 3.65
పర్వతగిరి 5.43 9.24 10.00
రాయపర్తి 4.24 5.35 6.77
సంగెం 2.99 3.36 3.60
వర్ధన్నపేట 7.00 7.28 7.22
వరంగల్ 2.34 2.56 2.54
ఖిలా వరంగల్ 1.04 1.37 2.07
సాక్షి, వరంగల్: జిల్లాలో కాల్వలు, బావుల కింద రబీ వరినాట్లు జోరందుకున్నాయి. దీంతో నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలమట్టం తగ్గుతోంది. 2024 నవంబర్‌లో జిల్లా సగటు 3.40 మీటర్ల ఎగువన నీరు ఉంటే.. ఈ ఏడాది జనవరి నాటికి 4.82 మీటర్లకు పడిపోయింది. ఫిబ్రవరి, మార్చిలో నీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో భూగర్భ జలమట్టం బాగా తగ్గే అవకాశముందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పంటలకు నీటిని పొదుపుగా వాడడం వల్ల భూగర్భ జలమట్టం తగ్గింపును కాస్త నిలువరించే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.
సహజవనరుల విధ్వంసంతో..
జిల్లాలో 13 మండలాల్లో 1,16,500 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 1,02,000 ఎకరాల్లో సాగు చేస్తున్న వరి పంటకు ఎక్కువ అవసరం ఉండడంతో పొదుపుగా నీరు వాడుకోవాలని అధి కారులు చెబుతున్నారు. ఇంకోవైపు ఆకేరు వాగు పరిసర ప్రాంతాల్లో నీటిమట్టాలు పడిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఆ వాగు నుంచే ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంతో నీరు నిలిచేందుకు కూడా ఆస్కారం ఉండకపోవడం మరో కారణం. సహజవనరుల విధ్వంసం వల్లనే కొన్ని మండలాల్లో భూగర్భ జలమట్టాలు పడిపోతుండడం గమనార్హం.
ఫిజోమీటరుతో నీటి నిల్వ కొలతలు
2015లోనే జిల్లాలోని సబ్‌స్టేషన్లు, ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని 21 ప్రాంతాల్లో 50 మీటర్ల మేర బోరుబావులు తవ్వారు. వీటికి రక్షణగా ఐరన్‌బాక్స్‌లు అమర్చి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. నెలకోసారి సంబంధిత అధికారులు ఫిజోమీటరు సహకారంతో బోరుబావుల్లో నిల్వ ఉన్న నీటిని కొలుస్తారు. దుగ్గొండి, నర్సంపేట, సంగెం, రాయపర్తిలో ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డింగ్ దారా ప్రతి ఆరు గంటలకోసారి అక్కడ ఏర్పాటుచేసిన సాఫ్ట్‌వేర్ సహకారంతో నీటి నిల్వ ఎంత ఉందనేది తెలిసిపోతుంది.
ఈ మండలాల్లో ఇబ్బందికరం..
● పర్వతగిరిలో గతేడాది మే నెలలో 11.72 మీటర్లో లోతున భూగర్భ జలమట్టం ఉంటే.. ఆ తర్వాత కురిసిన వర్షాలతో అక్టోబర్‌లో 5.82 మీటర్లుపైకి నీరు చేరింది. సాగు ప నులు ప్రా రంభం కావడంతో నవంబర్‌లో 5.43 మీటర్లు, డిసెంబర్‌లో 9.24 మీటర్లు, జనవరిలో 10 మీటర్లకు తగ్గింది.
● వర్ధన్నపేటలో గతేడాది మే నెలలో 8.02 మీటర్ల లోతున భూగర్భ జలమట్టం ఉంటే.. ఆ తర్వాత వర్షాలతో అక్టోబర్‌లో 6.93 మీటర్లపైకి నీరు చేరింది. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో నవంబర్‌లో 7మీటర్లు, డిసెంబర్‌లో 7.28 మీటర్లు, జనవరిలో 7.22 మీటర్లకు పడిపోయింది.
● రాయపర్తి మండలంలో గతేడాది మే నెలలో 8.54లోతున భూగర్భ జలమట్టం ఉంటే.. ఆ తర్వాత వర్షాలతో అక్టోబర్‌లో 3.85 మీటర్లు, నవంబర్‌లో4.24మీటర్లు,డిసెంబర్‌లో 5.35 మీ టర్లు, జనవరిలో 6.77 మీటర్లకు పడిపోయింది.
నీటిని పొదుపుగా వాడుకోవాలి..
నీటి వనరులను పొదుపుగా వాడుకుంటే మంచిది. వేసవిలో మరింత వినియోగం పెరుగుతుంది. సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. జిల్లాలో 90 వేలకుపైగా వ్యవసాయ బోర్లు పనిచేస్తున్నాయి. ఇంకా కొత్త బోర్ల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ప్రస్తుతమున్న నీటి లభ్యతతో పంటలు గట్టెక్కుతాయి. తాగునీటి అవసరాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు.
– ఎం.అశోక్, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి
న్యూస్‌రీల్
జిల్లాలో పంటల సాగు వివరాలు ఎకరాల్లో..
పంట విస్తీర్ణం
వేరుశనగ 950
మిర్చి 12,000
కంది 700
పసుపు 850
వరి 1,02,000
మొత్తం 1,16,500
వరంగల్
వరంగల్
Comments
Please login to add a commentAdd a comment