‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
నెక్కొండ: పదో తరగతి విద్యార్థులకు ప్రతి రోజూ మోడల్ పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. మండలంలోని ఆదర్శ పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టడీ మెటీరియల్, అల్పాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ రాజ్‌కుమార్ ఉన్నారు.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. నెక్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. హెచ్‌ఎంగా యాకూబ్‌అలీ, డీఈఓగా మానస, డిప్యూటీ డీఈఓగా సరస్వతి, ఎంఈఓగా వర్షశ్రీ వ్యవహరించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు బండారి రమేశ్, సురేశ్, కుమారస్వామి, భిక్షపతి పాల్గొన్నారు.
ఎల్‌బీ కళాశాలలో ఇంటర్
మూల్యాంకన క్యాంపు
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా కేంద్రంగా ఎల్‌బీ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన క్యాంపు ఏర్పాటు చేసేందుకు ఇంటర్ బోర్డు అధి కారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్‌సుమన్ తెలిపారు. గతంలో హనుమకొండ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు. 6 జిల్లాలకు ఒక్క క్యాంపు అసౌకర్యంగా ఉందని గుర్తించిన అధికారులు జిల్లా కేంద్రంగా కొత్త మూల్యాంకన కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్‌బీ కళాశాలలో ఏర్పాటు కానున్న మూల్యాంకన క్యాంపులో మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల కోడింగ్ వాల్యుయేషన్‌కు సంబంధించిన పనులు మార్చి నుంచి ప్రారంభించడానికి ఆదేశాలు జారీచేసినట్లు డీఐఈఓ శ్రీధర్‌సుమన్ తెలిపారు.
యూరియా కోసం
రైతుల బారులు
ఖానాపురం: యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీల్లో ఇచ్చిన కొద్ది మొత్తాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం నుంచి యూరియా లేకపోవడంతో రైతులు ఖానాపురం సొసైటీ చుట్టూ ప్రదక్షిణ చేశారు. బుధవారం ఉదయం యూరియా రావడంతో బారులు తీరారు. వచ్చిన యూరియా అయిపోవడంతో వెనుదిరిగారు. దీంతో సొసైటీ అధికారులు మరో సారి మధ్యాహ్నం యూరియా తెప్పించడంతో రైతులు తీసుకెళ్లారు.
కేంద్ర బడ్జెట్‌ను సవరించాలి
వరంగల్ చౌరస్తా: కేంద్ర బడ్జెట్‌ను సవరించాలని కమ్యూనిస్టు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. 10 కమ్యూనిస్టు, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ సెంటర్‌లో ధర్నా చేశారు. దీంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపో యి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూడెమొక్రసీ నేత రాచర్ల బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50 శాతం నిధులు పెంచాలని, జీడీపీలో విద్య, వైద్య రంగాలకు మూడు శాతం నిధులు అదనంగా ఇవ్వాలని, ప్రజాపంపిణీ వ్యవస్థకు రాయితీలు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, పలు పార్టీల నాయకులు గంగుల దయాకర్, అక్కెనపల్లి యాదగిరి పాల్గొన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
Comments
Please login to add a commentAdd a comment