● నిబంధనలు పాటించకపోతే బిల్లుల్లో కోత
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ, ఇతర అభివృద్ధి పనులను గురువారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పరిధి సుందరయ్యనగర్‌లో సీసీ రోడ్డు డ్రెయిన్, 18వ డివిజన్ పరిధి క్రిస్టియన్ కాలనీలోని కమ్యూనిటీహాల్, చింతల్‌లో సీసీరోడ్డు డ్రెయిన్, 33వ డివిజన్ శాంతినగర్‌లో కొనసాగుతున్న శ్మశానవాటిక అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. హనుమకొండ పరిధి హసన్‌పర్తి భీమారంలో సీసీరోడ్డు డ్రెయిన్ పనులను కమిషనర్ కొలతల ద్వారా పరిశీలించారు. ఆమె వెంట ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, సంతోష్ బాబు, డీఈలు రవికిరణ్, రాజ్‌కుమార్, ఏఈలు మోజామిల్, సతీశ్, స్మార్ట్‌సిటీ పీఎంసీ భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment