మేడారంలో వృద్ధుడి అదృశ్యం
ఖానాపురం: మేడారంలో వృద్ధుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు జబ్బ సారంగం ఈనెల 13న కుటుంబ సభ్యులతో కలిసి మేడారం వెళ్లాడు. తల్లుల దర్శనం అనంతరం మ్యూజియం సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. వృద్ధుడిని అక్కడే ఉంచి కుటుంబ సభ్యులు జాతరలో వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్లారు. తిరిగి వారు వచ్చి చూడగా ఆయన కనిపించలేదు. జాతరలో వెతికినా ఆచూకీ లభించలేదు. సారంగం బంధువు కంగల చంద్రయ్య ఫిర్యాదు మేరకు గురురవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment