డంపింగ్‌యార్డుల్లోకి చెత్త
చెన్నారావుపేట: డంపింగ్‌యార్డుల్లోకి చెత్త చేరుతోంది. తడి, పొడి చెత్తను పంచాయతీ కార్యదర్శులు వేరు చేస్తున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో డంపింగ్ యార్డులు నిర్మించింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ‘ఎక్కడి చెత్త అక్కడే’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా పంచాయతీ అధికారి కల్పన స్పందించారు. ఆమె ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తమయ్యారు. బయట వేసిన చెత్తను వేరుచేసి డంపింగ్‌యార్డులకు తరలించారు. అంతేకాకుండా చెత్త సేకరణ కేంద్రంలో సేంద్రియ ఎరువు తయారీ పనులు కూడా ప్రారంభించారు. దీంతో ప్రజలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
డంపింగ్‌యార్డుల్లోకి చెత్త
డంపింగ్‌యార్డుల్లోకి చెత్త
Comments
Please login to add a commentAdd a comment