లక్ష్యం రూ.117.31 కోట్లు
● లక్ష్యం రూ.117.31 కోట్లు ● వసూళ్లు రూ.50.31 కోట్లు
● కొందరు అధికారుల తీరు ఆగమాగం
● జీడబ్ల్యూఎంసీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం
● సమీక్షలతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు
వసూళ్లను చేధించని ఉద్యోగులకు తాఖీదులివ్వడం వరకే అధికారులు పరిమితమవుతున్నారు. క్షేత్ర స్థాయిలో రోజువారీగా ఏ మాత్రం వసూళ్లపై దృష్టి సారించట్లేదు. గ్రేటర్‌లో ఆస్తి, నీటి పన్నుల చెల్లింపునకు ఆన్‌లైన్ ద్వారా అనేక మార్గాలున్నాయి. వివిధ అవసరాల రీత్యా పన్ను చెల్లింపుదారులే 60 శాతానికిపైగా మీ సేవ కేంద్రాలు, డెబిట్, క్రిడెట్ కార్డుల ద్వారా చెల్లిస్తున్నారు. కేవలం 30 శాతం మాత్రమే క్షేత్రస్థాయిలోకి వెళ్లి వార్డు ఆఫీసర్లు, ఆర్‌ఐలు పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో సిబ్బంది ఇతర పనులకు విధులు అప్పగించడంతో కూడా వసూళ్లపై ప్రభావం చూపుతోంది. ఏడాదిలో 10 నెలల పాటు వసూళ్లపై నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బంది రెండు నెలల గడువులోగా క్షేత్రస్థాయిలో ప్రజలు పన్నులు చెల్లించాలనే ఒత్తిళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా గ్రేటర్ పన్నుల విభాగం సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాలి. భారీ బకాయిదారులపై దృష్టి సారించాల్సి న అవసరం ఉంది. లేకపోతే పన్ను వసూళ్ల లక్ష్యం వెనకబడిపోనుంది.
ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 38 రోజుల గడువే మిగిలి ఉంది. నిర్ణీత గడువులోగా.. కనీసం 90 శాతం ఆస్తి, నీటి పన్నులు వసూలు చేయాలి. కానీ.. పది నెలల ఇరవై రోజులు గడిచినా.. లక్ష్యంలో కనీసం సగం కూడా వసూలు చేయని పరిస్థితి. గ్రేటర్ పన్నుల విభాగం యంత్రాంగం నిద్ర నుంచి మేల్కొనకపోతే లక్ష్యం చేరుకునేలా కనిపించట్లేదు.
రావాల్సింది రూ.67
కోట్లు
పన్ను వసూలుపై కొరవడిన శ్రద్ధ
కొరవడిన పర్యవేక్షణ..
ఆపసోపాలు..
లక్ష్యాన్ని చేరుకుంటాం..
ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు బాగానే చేస్తున్నాం. నెల రోజులుగా రోజూ, వారాంతపు టార్గెట్లు పెట్టి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. మార్చి 31 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటాం.
– రామకృష్ణ, బల్దియా పన్నుల విభాగాధికారి
లక్ష్యం రూ.117.31 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment