ఆప్కాస్ రద్దు నిర్ణయంపై ఆరగహం
భీమవరం: ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు కాంట్రాక్టర్ ద్వారా పారిశుద్ధ్య పనులు చేయించాలనే కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించాలని సీఐటీయు డిమాండ్ చేసింది. మంగళవారం భీమవరం 5వ డివిజన్ మస్టర్ కార్యాలయం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు మాట్లాడుతూ ఆప్కాస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని, నూతన పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు పని భారం పెరిగిందని దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని, ఇంజనీరింగ్ సెక్షన్‌లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.36 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో యూనియన్ నాయకులు నీలాపు రాజు, నీలాపు అప్పన్న, పెంటా సత్యనారాయణ, మురళి, దుర్గమ్మ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment