భీమవరం: విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పబ్లిక్ పరీక్షలకు హాజరైతే నూరు శాతం ఫలితాలను సాధిస్తారని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అన్ని జెడ్పీ పాఠశాల టెన్త్ విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమాన్ని గూగుల్ మీట్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మోటివేషన్ కార్యక్రమంలో 13 వేల మంది విద్యార్థులతోపాటు 1,500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారన్నారు. జీవితంలో ముందుకు సాగాలంటే పిల్లలకు ధైర్యం అవసరమన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ నుంచి స్వామి సేవ్యానంద్ విద్యార్థులతో గూగుల్ మీట్ ద్వారా మాట్లాడుతూ సమస్త శక్తి మీలోనే ఉంటుందని మీరు ఏదైనా సాధించగలరని స్వామి వివేకానందను గుర్తు చేస్తూ తెలిపారు. శక్తి అనేది ప్రతి ఒక్కరిలో సమానంగానే ఉంటుందని మనం ఏదీ ఆలోచిస్తే అదే జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment