మెకానికల్ వర్క్‌షాప్
నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో ఆటోడెస్క్ ఇన్వెంటరీ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. IIలో u
ఓటుకు నోట్లు
● తెలుగుదేశం పార్టీ పూర్తిగా బరితెగించి పీడీఎఫ్ ఏజెంట్లే లక్ష్యంగా దాడులకు, ఘర్షణలకు తెగబడింది.
● దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగిలో పీడీఎఫ్ ఏజెంటుగా సీఐటీయూ నాయకుడు గేదెల శివకుమార్‌పై టీడీపీ శ్రేణులు దౌర్జన్యం చేసి దాడి చేశారు.
● జంగారెడ్డిగూడెంలోనూ ఘర్షణ జరిగినట్టు సమాచారం.
● లింగపాలెం మండలంలోని శింగగూడెం పోలింగ్ బూత్ 277, 278లో టీడీపీ నేతలు అత్యుత్సాహంగా వ్యవహరించారు. నేరుగా స్కూల్ ప్రాంగణంలోని పోలింగ్‌బూత్ పక్కనే గుంపులుగా ఉండి ఓటర్లను ప్రలో భ పెట్టడంతో పాటు బూత్‌లో ఏజెంటుగా ఉన్న డీవైఎఫ్‌ఐ నాయకుడు సూర్యకిరణ్‌ను బెదిరించి మొబైల్ లాక్కుని బయటకు గెంటేశారు. ఈ పోలింగ్ బూత్‌లో అత్యధికంగా 78 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో ఆధార్ కార్డుల ఆధారంగా దొంగ ఓట్లు పోలైనట్టు పీడీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు.
● యడవల్లి గ్రామానికి చెందిన సి.చిన్నారావు కుటుంబంతో సహా ఓటు వేయడానికి 278 పోలింగ్ బూత్‌కు వస్తే అప్పటికే అతని ఓటు పోలైంది. పోలింగ్ సిబ్బందిని తన ఓటు గురించి ప్రశ్నించి స్పందన లేకపోవడంతో వెనుదిరిగారు.
● దెందులూరు హైస్కూల్‌లో 347, 348 పోలింగ్ బూత్‌ల్లో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేష్ చీఫ్ ఏజెంటుగా వ్యవహరించి నాన్‌లోకల్ ఓట్లు వేయించారని పీడీఎఫ్ ఆరోపించింది.
● అలాగే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి కై కలూరు నియోజకవర్గం మండవల్లిలో బహిరంగంగానే ఓటుకు నోటు పంపిణీ చేశారు.
● ఏలూరు నగరంలో కోటదిబ్బలోని కల్యాణ మండపంలో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండటంతో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకునే లోపు కల్యాణ మండపానికి తాళాలు వేసి వెళ్లిపోయారు.
● పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ఇదే రీతిలో హల్‌చల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment