నాణ్యమైన పొగాకును పండించాలి
బుట్టాయగూడెం: రైతులు నాణ్యమైన పొగాకును పండించి అధిక దిగుబడులు సాధించాలని జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రం ఆక్షన్ సూపరింటెండెంట్ బి. శ్రీహరి సూచించారు. బుట్టాయగూడెంలో పొగాకు బోర్డు అధికారుల బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గద్దే శ్రీధర్ పొలంలో ప్రకృతి వ్యవసాయం, పొటాషియం, రిలీజింగ్ బ్యాక్టీరియా వాడకంపై క్షేత్ర దినోత్సవ సదస్సును నిర్వహించారు. పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని పెంపొందించుకోవాలన్నారు. పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన పొగాకును పండించాలని కోరారు. కార్యక్రమంలో ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ ప్రశాంత్ జోషి, ఐటీసీ కంపెనీ మేనేజర్ ఆదర్శ, కంపెనీ పీఎస్‌ఎస్ నాగేంద్ర, పొగాకు రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డినాయుడు, గొట్టుముక్కల మల్లికార్జున రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక
తణుకు అర్బన్: ఈనెల 14 నుంచి 16 తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి సంగాడి సత్యనాగ గణేష్ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.మోహన్‌బాబు తెలిపారు. ఈనెల 9వ తేదీన తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–16 కబడ్డీ పోటీల్లో గణేష్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడన్నారు. క్రీడాకారుడు గణేష్‌తోపాటు, శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను హెచ్‌ఎం మోహన్‌బాబుతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
నాణ్యమైన పొగాకును పండించాలి
Comments
Please login to add a commentAdd a comment