అమ్మకు భరోసా..
సేవలందించేందుకు
460 మంది నియామకం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా రూపొందించిన కార్యాచరణ పక్కాగా అమలు చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.ఇందుకోసం 461 మందిని కేటాయించారు. ఇందులో వైద్యారోగ్య సిబ్బందితో పాటు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, టీచర్లు ఉంటారు. వీరికి రెండు రోజుల క్రితం కలెక్టర్ హనుమంతరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ
సాక్షి, యాదాద్రి : ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడానికి వైద్యులు దృష్టి సారించాలి.. అత్యవసరం అయితేనే ఆపరేషన్లు చేయాలి’ అని వైద్యారోగ్యశాఖ దిశానిర్దేశం చేసింది. అయినా గణాంకాలు చూస్తే మార్పు ఏమీ కనిపించడం లేదు. గతంలో మాదిరిగానే సాధారణ ప్రసవాలు, శస్త్ర చికిత్సలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు డెలివరీ తేదీ ఉన్న గర్భిణుల ఇళ్లకు వెళ్లి న్యూట్రిషన్ కిట్‌లు అందజేయనున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యంపై భరోసా కల్పించనున్నారు.
చేపట్టే కార్యక్రమాలు ఇవీ..
మార్చి 31వ తేదీ వరకు డెలివరీ తేదీ ఉన్న మహిళలు రికార్డుల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 461 మంది నమోదయ్యారు. వైద్యారోగ్య సిబ్బంది ఈనెల 17వ తేదీన సాయంత్రం 5 గంటలకు గర్భిణిల ఇళ్లకు వెళ్లి తలుపు తడుతారు. వారితో కూర్చొని యోగ క్షేమాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం, వైద్య పరీక్షలు, తీసుకుంటున్న ఆహారం తదితర విషయాల గురించి చర్చిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ఉన్న అపోహలను తొలగిస్తారు. నార్మల్ డెలివరీల వల్ల ప్రయోజనాలు, సిజేరియన్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, నిపుణులైన వైద్యుల గురించి వివరిస్తారు. రూ.500 విలువ చేసే న్యూట్రిషన్ కిట్ అందజేస్తారు. ‘ప్రభుత్వ ఆస్పత్రికి రండి.. సుఖ ప్రసవం చేసి క్షేమంగా ఇంటికి పంపుతాం’ అంటూ ప్రోత్సహిస్తారు. మార్చి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
● ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తారు. గర్భిణులకు రోజూ కాల్ చేసి ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి తెలియజేస్తారు.
● ఆస్పత్రులకు వచ్చే గర్భిణులను వైద్యుల వద్దకు తీసుకెళ్లేందుకు హెల్స్‌డెస్క్‌ల్లో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు.
ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు
జిల్లాలో 2023 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 7,937 ప్రసవాలు జరిగాయి. ఇందులో నార్మల్ 3,661, సిజేరియన్లు 4,276 ఉన్నాయి.
సాధారణ కాన్పులు పెరగాలి
ఫ కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే కాకుండా సాధారణ కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మహిళా ఆరోగ్య కార్యకర్తలకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై సలహాలు, సూచనలు చేశారు. గర్భిణుల ఇళ్లకు వెళ్లి పోషకాహారం, వైద్య పరీక్షలు, వ్యాయామం గురించి అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు ఆరో గ్యపరంగా తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి పరీక్షలు చేయించాలని, తద్వారా మాత, శిశు మరణాలను తగ్గించవచ్చన్నారు. సమావేశంలో మాతాశిశువు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ యశోధ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శిల్పిని, ఆర్మన్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది డాక్టర్ రోహిణి, డాక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఈనెల 17నుంచి ‘గర్భిణుల ఇళ్లకు వెళ్లి..
తలుపుతట్టి’ కార్యక్రమానికి శ్రీకారం
ఫ ఆరోగ్య వివరాలు తెలుసుకుని న్యూట్రిషన్ కిట్లు అందజేయాలని నిర్ణయం
ఫ సలహాలు ఇచ్చేందుకు ఆస్పత్రుల్లో హెల్స్‌డెస్క్‌లు ఏర్పాటు
ఫ గర్భిణులను వైద్యుల వద్దకు
చేర్చేందుకు ప్రత్యేక సిబ్బంది
అమ్మకు భరోసా..
Comments
Please login to add a commentAdd a comment