యాదగిరిగుట్ట : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆయన పేరున ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైకుంఠద్వారం వద్ద ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై ఎవరైతే కుట్రలు చేశారో వారి చేతుల్లోనే నేడు తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని.. మన నిధులు, మన వనరుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉన్నారని, ఆయన ఆనవాళ్లు తుడిచివేయడం ఎవరితరం కాదన్నారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. యాదగిరి క్షేత్రాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, ప్రజల తరఫున పోరాటం చేసేందుకు మరింత శక్తి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. సమగ్ర కు టుంబ సర్వే పారదర్శకంగా జరగని కారణంగా తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. అనంతరం డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ పాటలకు డ్యాన్స్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మ హేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు తుంగబాలు, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, యాదగిరి గుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ కార్యదర్శి పాపట్ల నరహరి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అనురాధ పాల్గొన్నారు.
ఫ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆరేదే
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment