ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
సాక్షి,యాదాద్రి: వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. జిల్లాలో మంచి నీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి సరఫరా పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తాగు నీటి సరఫరా నిమిత్తం మిషన్ భగీరథ ద్వారా అందుబాటులో ఉన్న నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఏదైనా నివాస ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు గమనించిన వెంటనే, ముందస్తుగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా నీటి సమస్య ఏర్పడితే గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గంగాధర్, చీఫ్ ఇంజనీర్ లలిత, జెడ్పీసీఈఓ శోభారాణి, మిషన్ భగీరథ ఎస్‌ఈ కృష్ణయ్య, ఈఈ కరుణాకరన్, ఈఈ లక్ష్మీనారాయణ, డీపీఓ సునంద, డీఈలు, డీఎల్‌పీఓలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment