
ప్రచారం పరుగులు
నగర శివార్లు,
భువనగిరిలో పార్టీలు ఫుల్
కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపగా.. మిగతావారు చివరి రెడు, మూడు రోజుల్లో మొదలుపెట్టాలన్న యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రధాన సంఘం అభ్యర్థి తరఫున ఉప్పల్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ మంగళవారం రాత్రి గెజిటెడ్ హెడ్‌మాస్టర్‌లకు దావత్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే భువనగిరి శివారులోని ఎల్లమ్మగుడి వద్ద, భువనగిరిలోని పలు ఫంక్షన్ హాళ్లలో ఓటర్లకు పెద్ద ఎత్తున మందు దావత్‌లు జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా ఓ ఫంక్షన్ హాల్‌లో భారీ ఎత్తున పార్టీ ఇచినట్లు తెలుస్తోంది.
సాక్షి, యాదాద్రి : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. పోలింగ్‌కు మరో ఆరు రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన సంఘాల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు తమ అనుచరులతో కలిసి ప్రచారంలో మరింత జోరు పెంచారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ప్రధాన పోటీ ఐదారు సంఘాల మధ్యనే నడుస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు యూటీఎఫ్ ప్రయత్నిస్తుండగా, ఈ సారైనా గెలిచి కోల్పోయిన స్థానాన్ని నిలబెట్టుకోవాలని పీఆర్టీయూ పావులు కదుపుతోంది. మరో వైపు ఎలాగైనా బోణీ కొట్టాలన్న లక్ష్యంతో టీపీయూఎస్ ప్రయత్నిస్తోంది. దీంతో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
ప్రలోభాలు షురూ..!
పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు అభ్యర్థులు ముందుగానే ప్రలోభాలకు తెరలేపారు. దావత్‌లు ఏర్పాటు చేయడంతో పాటు డబ్బు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన అభ్యర్థుల్లో ఒకరు ఓటుకు రూ.4 వేల చొప్పున ఇచ్చేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడని, అతనికి మద్దతుగా ఓ ప్రధాన పార్టీ తమ కార్యకర్తలతో ఉపాధ్యాయుల ఫోన్ నంబర్లు సేకరించి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. మరో ప్రధాన సంఘం అభ్యర్థి ఓటుకు రూ.5 వేల వరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఇక అధికార పార్టీ అండదండలున్న ఇంకొకరు.. ఓటర్లకు పంచేందుకు పెద్ద ఎత్తున నగదు సిద్ధంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలవంతుడిగా పేరున్న మరో అభ్యర్థి ఉపాధ్యాయుల్లో పట్టు లేనప్పటికీ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి గెలవాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హోరెత్తుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఫ విజయం కోసం
సర్వశక్తులొడ్డుతున్న అభ్యర్థులు
ఫ ఉపాధ్యాయుల మద్దతు
కూడగట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు
ఫ దావత్‌లు, నగదు పంపిణీ!
ఫ రసవత్తరంగా పోరు
ఓటర్లు 24,905
ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల్లోని 191 మండలాల పరిధిలో 24,905 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 14,940, మహిళలు 9,965 మంది ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment