
నూతనంగా 8 శాఖలకు అనుమతి
ఫ 22 శాఖలకు విస్తరించనున్న పోంచపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పరిధి పెరగనుంది. మరో ఎనిమిది నూతన శాకలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చినట్లు బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, సీఈఓ సీత శ్రీనివాస్ గురువారం తెలిపారు. భువనగిరి, నల్లగొండ (రెండో బ్రాంచ్), జనగాం, నాగర్‌కర్నూల్, వనపర్తి, నకిరేకల్, కోదాడ, బడంగ్‌పేటలో నూతన శాఖల ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 14 శాఖలు విజయవంతంగా నడుస్తున్నాయని, కొత్తవాటితో కలుపుకుని 22 శాఖల ద్వారా వినియోగదారులకు బ్యాంకు సేవలను విస్తరించామన్నారు. నూతన శాఖల మంజూరు పట్ల బ్యాంకు పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment