కలెక్టర్‌కు ఆహ్వానం
భువనగిరిటౌన్: కలెక్టర్ హనుమంతరావును యాదగిరిగుట్ట ఆలయ ఈఓ భాస్కర్‌రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.
నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి
భువనగిరి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశ నోడల్ పర్సన్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణుల వివరాలను ఎంసీహెచ్ కిట్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి మహిళా ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రసవం అనంతరం పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ యశోధ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శిల్పిని, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయిశోభ, డిమో అంజయ్య, ఆశ నోడల్ అధికారి సత్యవతి పాల్గొన్నారు.
గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా చూడాలి
యాదగిరిగుట్ట రూరల్: వేసవి నేపథ్యంలో గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా చూడాలని డీఎల్పీఓ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, మోటకొండూర్ ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల చివరి వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. సమావేశంలో ఎంపీఓలు సలీమ్, వెంకటేశ్వర్లు, కిషన్, చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
స్వర్ణగిరిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, సాయంత్రం భగవదజ్ఞ, రక్షాబంధనం నిర్వహించారు. అంతకు ముందు సుమారు 4వేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు, ధర్మకర్తలు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఆహ్వానం
కలెక్టర్‌కు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment