భక్తులకు సదుపాయాలు కల్పించాలి
యాదగిరిగుట్ట: కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ అధికారులు సదుపాయాలు కల్పించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. సంప్రోక్షణ ఉత్సవాల్లో భాగంగా ఈ సందర్భంగా కొండపైన గల దేవాలయ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్‌రావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. యాగశాల నిర్వహణ, భక్తులకు రవాణా సదుపాయం, దర్శనం ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీ, మెడికల్ క్యాంప్, పరిశుభత్ర, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. అంతకు ముందు కొండ కింద హెలిపాడ్ స్థలం, కొండపైన స్వాగత తోరణానికి ఇరువైపులా వేస్తున్న రంగులు, ఘాట్‌రోడ్డు, ప్రధానాలయాన్ని పరిశీలించారు.
ఫ దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజా రామయ్యర్
Comments
Please login to add a commentAdd a comment