మహోత్సవానికి వేళాయే..
పంచకుండాలు సిద్ధం
మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా పంచకుండాత్మక హోమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రధానాలయ ఉత్తర మాడ వీధిలో పర్ణశాల ఏర్పాటు చేశారు. వాసుదేవ, ప్రద్ద్యుమ్న, సంకర్షణ, నారాయణ, అనిరుద్ధ అనే దేవతమూర్తుల పేర్లతో ఐదు కుండాలు సిద్ధం చేశారు. పంచకుండాల చెంత విశేష హోమాధి పూజలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలో 108 మంది రుత్వికులతో నృసింహ మూల, మూర్తి మంత్రం, రామాయణ, మహా భారత ఇతి హాసాల పఠనం చేపట్టనున్నారు.
యాదగిరి క్షేత్రంలో రేపటి నుంచి మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం.. ఏర్పాట్లు పూర్తి
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 19నుంచి 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహాయాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేయనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీమధురకవి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు. వేడుకకు వచ్చే అతిథులు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా, ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా ఈఓ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ స్వాగత తోరణాలు
మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం అనంతరం మార్చి 1నుంచి నుంచి 11వ తేదీ వరకు జరిగే శ్రీస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రధానాలయం, ఆలయ పరిసరాలు, యాదగిరిగుట్ట పట్టణం, వంగపల్లి, రాయగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ తోరణాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా తెలంగాణ టీ చౌరస్తా నుంచి వైకుంఠద్వారం వరకు ఇరువైపులా దేవుళ్ల రూపాలతో కూడిన లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు.
ఆలయం శుద్ధి
ప్రధానాలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపాలను సోమవారం దేవస్థానం సిబ్బందితో కలిసి ఆలయ ఈఓ భాస్కర్‌రావు స్వయంగా శుద్ధి చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30గంటల వరకు దర్శనాలను నిలిపివేశారు. ఆలయ శుద్ధి పూర్తయిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిచ్చారు.
విద్యుత్ దీపాలతో అలంకరణ
ప్రధానాలయం, ఉప ఆలయాలతో పాటు యాదగిరికొండ చుట్టూ ఆకర్షణీయంగా ఉండేలా రంగురంగుల విద్యుత్ కాంతులు విరజిమ్మే లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు యాదగిరికొండపైన జరిగే పూజాధి కార్యక్రమాల వివరాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు భక్తులు, యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు వినిపించేలా మైక్‌లు ఏర్పాటు చేశారు.
సమిధలు అందజేత
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమానగోపురం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నిర్వహించే పంచకుండాత్మక యాగా నికి పలువురు దాతలు సోమవారం సమిధలు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట పురం విద్యాసాగర్, బాణాల శ్రీకాంత్ సుమారు 30 క్వింటాళ్ల మామిడి, మోదుగు సమిధలను టీటీడీ లోకల్ అడ్వైజరీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్ ద్వారా అందజేశారు.
మహోత్సవానికి వేళాయే..
మహోత్సవానికి వేళాయే..
మహోత్సవానికి వేళాయే..
Comments
Please login to add a commentAdd a comment