‘గర్భిణి ఇంటికి వెళ్లి.. వైద్యసేవలపై ఆరా తీసి
గుండాల : గర్భిణులు సమతుల ఆహారం తీసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యకరమైన బిడ్డలు జన్మిస్తారని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా శ్రీగర్భిణి ఇంటికి వెళ్లి.. తలుపు తట్టిశ్రీ కార్యక్రమానికి సోమవారం గుండాల మండలం అనంతారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని హైరిస్క్ గర్భిణి అపర్ణ ఇంటిని సందర్శించారు. కలెక్టర్‌ను వచ్చానంటూ పరిచం చేసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని, వైద్య పరీక్షల చేయించుకుంటున్నారా, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారని గర్భిణిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు ఉన్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని సూచించారు. మొదటి రోజు 300 మంది హైరిస్క్ గర్భిణుల ఇళ్లను అధికారులు సందర్శించినట్లు తెలిపారు. ఆయన వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, తహసీల్దార్ జలకుమారి, ఎంపీడీఓ శంకరయ్య, వైద్యాధికారి హైమావతి, సీడీపీఓ జ్యోష్న, వైద్యసిబ్బంది ఉన్నారు.
శివుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు విశేషంగా చేపట్టారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆల య ముఖ మండపంలో స్పటిక లింగానికి పూజలు నిర్వహించారు. అదే విధంగా ప్రధానాలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కాంగ్రెస్ మహిళా విభాగం కార్యదర్శిగా వనజారెడ్డి
ఆలేరురూరల్ : కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన వనజారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావు, జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ సోమవారం గాందీభవన్‌లో ఆమెకు నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన మంత్రి కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఐలయ్య, జిల్లా ఇంచార్జి కృష్ణవేణికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment