దారులన్నీ గట్టువైపే
లింగమంతుల స్వామి జాతరకు పోటెత్తిన భక్తులు
సూర్యాపేట, చివ్వెంల,సూర్యాపేటటౌన్, భానుపురి: చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర రెండవ రోజు సోమవారం జనగట్టును తలపించింది. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. రెండవ రోజు చౌడమ్మ బోనాలు సమర్పించారు. మహిళా భక్తులు బోనాలతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి చౌడమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. స్వామి వారిని సోమవారం ఒక్కరోజే 6 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు అంచనా.
బోనాల సమర్పణ సాగిందిలా..
మున్న (రాజులు) మెంతబోయిన (పూజారులు) తమ ఇళ్ల నుంచి తెచ్చిన బియ్యంతో రెండు బోనాలు వండి స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడం ఈ జాతరలో ప్రత్యేకత. తొలుత మున్నవారు రాశిబోనం, తర్వాత మెంతబోయినవారు సందవసర బోనం సమర్పించారు. ఇరు బోనాల నుంచి కొంత అన్నం తీసి లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తొలిగొర్రె (మెంతబోయిన వారిది), బద్దెపాల గొర్రె (మున్న వారిది), వరద గొర్రె (గొర్ల వారిది)లను చౌడమ్మ తల్లికి ఎదురుగా బలిచ్చారు. ఆ మాంసాన్ని మున్న, మెంతబోయిన, బైకానివారు వాటాలుగా పంచుకుని వండి చౌడమ్మకు నైవేద్యం సమర్పించారు.
లింగమయ్య పూజల్లో ప్రముఖులు
లింగమంతుల స్వామిని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్‌రెడ్డి, కలెక్టర్ దంపతులు వేర్వేరుగా దర్శించుకున్నారు.
నేడు
చంద్రపట్నం
ఫ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఫ ఓ లింగా నామస్మరణతో మార్మోగిన పెద్దగట్టు
ఫ రెండవ రోజు ప్రత్యేకంగా సాగిన బోనాల సమర్పణ ఫ పూజల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్
దారులన్నీ గట్టువైపే
దారులన్నీ గట్టువైపే
దారులన్నీ గట్టువైపే
దారులన్నీ గట్టువైపే
Comments
Please login to add a commentAdd a comment